వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా
ఏలూరు రూరల్: జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏలూరు విద్యార్థినులు సత్తాచాటారు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్థానిక ఈదర సుబ్బమ్మదేవి పాఠశాల బాలికలు కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
ఏలూరు రూరల్: జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏలూరు విద్యార్థినులు సత్తాచాటారు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్థానిక ఈదర సుబ్బమ్మదేవి పాఠశాల బాలికలు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 44 కిలోల విభాగంలో కె.సత్యవతి, 48 కిలోల విభాగంలో ఎన్.సత్యవతి కాంస్య పతకాలు సాధించారు. దీపానయోమి ఐదో స్థానంలో నిలిచింది. వీరిని గురువారం పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం కె.మాధవీలత, ఉపాద్యాయులు వి.దుర్గారావు, వీవీ సుబ్రహ్మణ్యం, పీఈటీ పి.గోపాల్ అభినందించారు.