ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్రగాయాలు | passengers injured while auto slipped incident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్రగాయాలు

Sep 2 2016 9:03 AM | Updated on Apr 7 2019 3:24 PM

వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

గిద్దలూరు(ప్రకాశం): వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

ముండ్లపాడు నుంచి గిద్దలూరు వెళ్తున్న ప్రయాణికుల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement