నో క్యాష్‌ | No cash at ATM centers | Sakshi
Sakshi News home page

నో క్యాష్‌

Nov 17 2016 1:20 AM | Updated on Oct 20 2018 6:19 PM

నో క్యాష్‌ - Sakshi

నో క్యాష్‌

నెల్లూరు(సెంట్రల్‌): రద్దుచేసిన రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిని బుధవారం క్యాష్‌ లేదంటూ జిల్లాలోని పలు బ్యాంక్‌లు చేతులెత్తాశాయి. వారం రోజులుగా నగదు మార్పిడి చేస్తుండడంతో పాటు బ్యాంక్‌లకు సరిపడా కొత్త నోట్లు రాకపోవడంతో అధికారులు ఏమీ చేయలేక నోక్యాష్‌ అంటూ వచ్చిన వారికి సర్దిచెప్పి పంపించేశారు.

  • చేతులెత్తేసిన పలు బ్యాంక్‌లు
  •  మరికొన్నింటిలో అధిక రద్దీ
  • ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు
  • రూ.600 కోట్లు కావాలని ఆర్‌బీఐకి లేఖ రాసిన అధికారులు
  •  
    నెల్లూరు(సెంట్రల్‌):
    రద్దుచేసిన రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిని బుధవారం క్యాష్‌ లేదంటూ జిల్లాలోని పలు బ్యాంక్‌లు చేతులెత్తాశాయి. వారం రోజులుగా నగదు మార్పిడి చేస్తుండడంతో పాటు బ్యాంక్‌లకు సరిపడా కొత్త నోట్లు రాకపోవడంతో అధికారులు ఏమీ చేయలేక నోక్యాష్‌ అంటూ వచ్చిన వారికి సర్దిచెప్పి పంపించేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఊసూరు మంటూ వెనుతిరగారు. కొన్ని బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్లు మార్చుకున్న వారికి రూ.2 వేల నోట్లను అంటగట్టారు. అయితే ఈ నోట్లకు చిల్లర దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులోని సిండికేట్‌, ఎస్‌బీహెచ్‌ బ్యాంకుల అధికారులు తమవద్ద నగదు లేదని చెప్పడంతో నోట్ల మార్పిడి కోసం వచ్చినవారు ఇతర బ్యాంక్‌ల వద్దకు పరుగులు తీశారు. అక్కడికి వెళ్లినా చాంతాడంత క్యూ ఉండటంతో గంటల నిరాశతో వెనుదిరిగారు. 
    రూ.600 కోట్లు కావాలంటూ ఆర్‌బీఐకి లేఖ
    జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రద్దు నోట్లు తీసుకుని కొత్త నోట్లు  ఇవ్వాలంటే కనీసం రూ.600 కోట్లు కావాల్సిన పరిస్థితి ఉందని బ్యాంక్‌ల ఉన్నతాధికారులు ఆర్‌బీఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. బ్యాంక్‌లకు పంపిన కొత్త రూ.2 వేల నోట్లతో పాటు ఇప్పటివరకు ఉన్న రూ.100 నోట్లను  ఇప్పటి వరకు సర్దుబాటు చేస్తూ వచ్చామని వారు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నగదు జిల్లాలోని బ్యాంకులకు రాకుంటే మొత్తం బ్యాంకులతో పాటు, ఏటీఎంలను కూడా నగదు వచ్చే వరకు తాత్కాలికంగా  మూసి వేయాల్సిన  పరిస్తితి వస్తుందని పలువురు అధికారులు పేర్కొనడం గమనార్హం.
    టెన్షన్‌..
    ప్రస్తుతం సగానికిపైగా బ్యాంకులలో నగదు లేకపోవడంతోమ నగదు మార్పిడిని నిలిపేశారు. ఉన్న బ్యాంకులలో, ఏటీఎంలలో ఎప్పుడు నగదు అయిపోతుందో అని చాలా మంది టెన్షన్‌తో క్యూలో నిలబడుతున్నారు. రెండు రోజుల్లో కొత్త నోట్ల రాక పోతే పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.
    ప్రజల ఉక్కిరి బిక్కిరి...
    రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం రోజురోజుకు ఎక్కువగానే సామాన్య ప్రజలపై చూపుతోంది. ఇప్పటి వరకు మార్పిడి చేసిన కొత్త నోట్లు రూ.2 వేలు చూసుకునేదానికి ఉండడం, ఇట్లో ఉన్న కాస్తోకూస్తో చిల్లర నగదు అయిపోవడంతో సామాన్య ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పొద్దున లేచింది మొదలు నగదు మార్పిడి కోసమే క్యూలలో ఉండటంతో పలువురు రోజు వారి కార్యక్రమాలు సైతం నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
    రైతన్నలు ఇబ్బందులు
    జిల్లా సహకార బ్యాంకులలో రద్దయిన నోట్ల మార్పిడి లేక పోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడో జరిగిన తప్పుకు పూర్తిగా అన్ని సహకార బ్యాంకులలో పాత నోట్లను తీసుకోవద్దంటూ ఉన్నతాధికారులు చెప్పడం ఏమిటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement