పట్టణానికి చెందిన డైరెక్టర్ పురందర్‌దాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘నీ ఊహల్లో నేనుంటా’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక‌్షన్ బుధవారం స్థానిక ప్రణవ్ ఫంక‌్షన్ హాల్‌లో ఘనంగా జరుపుకున్నారు.
ధర్మవరం టౌన్ : పట్టణానికి చెందిన డైరెక్టర్ పురందర్‌దాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘నీ ఊహల్లో నేనుంటా’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక‌్షన్ బుధవారం స్థానిక ప్రణవ్ ఫంక‌్షన్ హాల్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీ.సూర్యనారాయణ, ఆర్డీఓ బాలానాయక్, తహశీల్దార్ మహబూబ్‌బాషా హాజరై ఆడియో సీడీలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ పురందర్ దాస్ మాట్లాడుతూ ధర్మవరం వాసి అయిన తాను ఎంతో శ్రమించి ‘నీ ఊహల్లో నేనుంటా’ సినిమాను నిర్మిస్తున్నట్లు చెప్పారు. యువతరం ఆలోచనలు, ఆకాంక‌్షలకు అద్దంపట్టేలా సినిమా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లా వాసులు వెండితెరలో రాణించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులతో పాటు సినిమా యూనిట్ సభ్యులు, నటీనటులు పాల్గొన్నారు.