'అమాయకులపై కేసులు పెడితే ఊరుకోం' | Mudragada Padmanabham demands to tdp govt | Sakshi
Sakshi News home page

'అమాయకులపై కేసులు పెడితే ఊరుకోం'

Feb 10 2016 2:18 PM | Updated on Aug 10 2018 6:21 PM

కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ఏడు నెలల్లోగా అమలుచేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు.

కాకినాడ : కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను ఏడు నెలల్లోగా అమలుచేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం విలేకర్లతో మాట్లాడారు. హామీల అమలు కోసం ప్రభుత్వం మరోసారి రోడ్లెక్కే పరిస్థితి రాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తుని ఘటనలో అమాయకులపై కేసులు పెడితే ఊరుకోమని ముద్రగడ స్పష్టం చేశారు. కాపు ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా ముద్రగడ కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement