ముద్రగడ పాదయాత్ర పై ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ కాపు జేఎసీ నేతలు నల్ల జెండాలు చేతబట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
నల్ల జెండాలతో కాపు నేతల నిరసన
Aug 14 2017 1:30 PM | Updated on Jul 30 2018 7:57 PM
కాకినాడ: ముద్రగడ పాదయాత్ర పై ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ కిర్లంపూడిలో కాపు జేఎసీ నేతలు సోమవారం ఉదయం నల్ల జెండాలు చేతబట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఛలో అమరావతి పాదయాత్ర కోసం కిర్లంపూడిలోని తన నివాసం నుండి బయటకు వచ్చిన ముద్రగడను పోలీసులు మళ్ళీ అడ్డుకున్నారు. దీంతో సీఎం చంద్రబాబు తీరుపై ముద్రగడ మండిపడ్డారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే ఎందుకు తనని అడ్డుకుంటున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు పాదయాత్రకు సంబంధించిన అనుమతి పత్రం కాపీని తనకి ఇస్తే.. అదే ఫార్మెట్ లో తాను పాదయాత్రకు అనుమతి కోరతానన్నారు.
Advertisement
Advertisement