కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దంపతులు అహారం తీసుకోకపోవటం మూలంగా నీరసంగా ఉన్నారని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు.
రాజమండ్రి: కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దంపతులు అహారం తీసుకోకపోవటం మూలంగా నీరసంగా ఉన్నారని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. 11 రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కించే విషయంలో ఇతర వైద్యుల సలహాలు సైతం తీసుకుంటున్నామని వారు వెల్లడించారు. రెండు గంటలకు ఒకసారి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ముద్రగడ ఆరోగ్య వివరాలను తెలుపుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ముద్రగడ బీపీ 140/90 గా ఉండగా, ఆయన భార్య పద్మావతి బీపీ 100/70 ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.