మదర్‌కు జన నీరాజనం | mother therisa | Sakshi
Sakshi News home page

మదర్‌కు జన నీరాజనం

Sep 4 2016 10:55 PM | Updated on Sep 4 2017 12:18 PM

థెరిసా చిత్రపటాన్ని ఊరేగిస్తున్న క్రైస్తవలు

థెరిసా చిత్రపటాన్ని ఊరేగిస్తున్న క్రైస్తవలు

నోబుల్‌ శాంతి అవార్డు గ్రహీత, విశ్వమాతగా గుర్తింపు పొందిన మదర్‌ థెరిసాకు వాటికన్‌ సిటీలో పోప్‌ సెయింట్‌ హూడ్‌గా ప్రకటించిన వేళ క్రైస్తవుల్లో ఆనందం వెళ్లివిరిసింది. మదర్‌ భారీ చిత్రపటంతో ఆదివారం బత్తిలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. పేదలకు సేవలు చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో తన వంతు మానవతా ధృక్పథంతో సేవలందించిన మదర్‌ విశ్వమాతగా గుర్తింపు పొందిన వేళ ఈ ప్రాంత క్రైస్తవులు ఆనందంలో మునిగిపోయ

 
బత్తిలి (భామిని) : నోబుల్‌ శాంతి అవార్డు గ్రహీత, విశ్వమాతగా గుర్తింపు పొందిన మదర్‌ థెరిసాకు వాటికన్‌ సిటీలో పోప్‌ సెయింట్‌ హూడ్‌గా ప్రకటించిన వేళ క్రైస్తవుల్లో ఆనందం వెళ్లివిరిసింది. మదర్‌ భారీ చిత్రపటంతో ఆదివారం బత్తిలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. పేదలకు సేవలు చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో తన వంతు మానవతా ధృక్పథంతో సేవలందించిన మదర్‌ విశ్వమాతగా గుర్తింపు పొందిన వేళ ఈ ప్రాంత క్రైస్తవులు ఆనందంలో మునిగిపోయారు. బత్తిలి ఆర్‌సీఎం చర్చి ప్రాంగణంలో థెరిసా చిత్రపటానికి పూజలు చేశారు. చర్చి ఫాదర్‌ వార శౌరి, ఆనందబాబుల ఆధ్వర్యంలో తిరు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. క్రైస్తవ గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ప్యారీస్‌ కమిటీ అధ్యక్షుడు టింగ అన్నాజీరావు, సహకార ౖyð రెక్టర్‌ టింగ సుమలత, మాజీ సర్పంచ్‌ గడబ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement