చౌక దుకాణాలే మినీబ్యాంకులు | mini banks by rations shops | Sakshi
Sakshi News home page

చౌక దుకాణాలే మినీబ్యాంకులు

Nov 18 2016 11:53 PM | Updated on Sep 4 2017 8:27 PM

జిల్లాలోని రేషన్‌డీలర్లు ఇక నుంచి బిజినెస్‌ కరస్పాండెంట్లగానూ పనిచేయాల్సి ఉంటుందని డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు తెలిపారు.

అనంతపురం సెంట్రల్‌ : జిల్లాలోని రేషన్‌డీలర్లు ఇక నుంచి బిజినెస్‌ కరస్పాండెంట్లగానూ పనిచేయాల్సి ఉంటుందని డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన చాంబర్‌లో తహశీల్దార్లు, సీఎస్‌డీటీలతో సమావేశం నిర్వహించారు.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో డీలర్లకు అదనపు ఆదాయం రావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు, నిత్యావసర సరుకులు పొందేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 

ప్రతి లావాదేవీకి రూ.5లు చొప్పున కమీషన్‌ను బ్యాంకులు అందజేస్తాయని తెలిపారు.  బిజినెస్‌ కరస్పాండెంట్స్‌గా ఉండేందుకు ఆసక్తి ఉన్న వారు పేర్లు నమోదు చేసుకోవాలని, నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు కమీషన్‌ రూపంలో వస్తుందని వివరించారు.

Advertisement

పోల్

Advertisement