మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలి | meeting need to succeed | Sakshi
Sakshi News home page

మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

Aug 6 2016 12:03 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ బూత్‌ కమిటీ సభ్యుల మహా సమ్మేళనాన్ని పార్టీ శ్రేణులు విజయవం తం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ హైదారాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 7న బూత్‌ కమిటీ సభ్యుల మహాసమ్మేళనం జరుగనుందన్నారు

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి
  • హన్మకొండ : బీజేపీ బూత్‌ కమిటీ సభ్యుల మహా సమ్మేళనాన్ని పార్టీ శ్రేణులు విజయవం తం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ హైదారాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 7న బూత్‌ కమిటీ సభ్యుల మహాసమ్మేళనం జరుగనుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారన్నారు. పార్టీ అధిష్టానం తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలను బీజేపీ వైపు అకర్షితులను చేయనున్నట్లు తెలి పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఒం టేరు జయపాల్, వన్నాల శ్రీరాములు, నాయకుల బానోత్‌ దిలీప్‌నాయక్, నాగపురి రాజ మౌళి, శ్రీరాములు మురళీమనోహర్, పెదగాని సోమయ్య, కాసర్ల రాంరెడ్డి, కూచన రవళి, తాళ్ళపల్లి కుమారస్వామి, చందుపట్ల కీర్తి, కొత్త దశరథం, గాదె రాంబాబు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement