స్థానిక వైఎస్ నగర్‌లోని సత్యపురంలో బేల్దారి మూడె శివకుమార్ నాయక్(22) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక వైఎస్ నగర్‌లోని సత్యపురంలో బేల్దారి మూడె శివకుమార్ నాయక్(22) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య సుకన్య, రెండేళ్ల కుమార్తె పూజిత ఉన్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శివకుమార్ నాయక్ మూడేళ్ల క్రితం సుకన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతను బేల్దారి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించే వాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తాగుడుకు బానిసై పనికి సరిగా వెళ్లడం లేదు. అధిక వడ్డీకి అప్పు చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా అతన్ని పట్టించుకోవడం లేదు. శుక్రవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.