విజయవాడలో ఆదివారం ఉదయం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అమరావతి మరథాన్ రన్ ప్రారంభమైంది.
విజయవాడ: విజయవాడలో ఆదివారం ఉదయం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అమరావతి మరథాన్ రన్ ప్రారంభమైంది. 21,5, 10కె రన్ మూడు రకాల మారథాన్ రన్ ప్రారంభమైయ్యాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని, ఏపీ డీజీపీ జేవీ రాముడు పాల్గొన్నారు.
ఇందులో 21కె మరథాన్‌ను సీపీ గౌతమ్ సవాంగ్, పాప్ సింగర్ స్మిత ప్రారంభించారు. 10కె మరథాన్ రన్‌ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ మూడు రకాల మరథాన్‌లో భారీ సంఖ్యలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.