భార్యాభర్తలు గొడవపడుతుండగా వారించిన వ్యక్తిని కత్తితో పొడిచిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో శనివారం ఉదయం జరిగింది.
సర్దిచెప్పినందుకు కత్తితో దాడి
Aug 13 2016 12:27 PM | Updated on Sep 4 2017 9:08 AM
మదనపల్లి రూరల్: భార్యాభర్తలు గొడవపడుతుండగా వారించిన వ్యక్తిని కత్తితో పొడిచిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో శనివారం ఉదయం జరిగింది. మదనపల్లి కదిరి రోడ్డులోని భాగ్యలక్ష్మి రైస్‌మిల్లు గోడౌన్ వద్ద సుబ్రమణ్యం(మణి), ఆయన భార్య సురేఖ గొడవపడుతుండగా అదే ప్రాంతానికి చెందిన మణికంఠ, రైజేష్ అనే అన్నదమ్ములు సర్దిజెప్పేందుకు ప్రయత్నించారు. దంపతుల మధ్య కీచులాటలు తగదని చెప్పడంతో ఆగ్రహించిన సుబ్రహ్మణ్యం కత్తితో ఇద్దరిపై దాడిచేశాడు.
ఈ సంఘటనలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందగా, రాజేష్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు కేరళకు చెందినవాడు. అన్నదమ్ములిద్దరూ స్థానిక జైభారత్ టైర్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. నిందితుడు సుబ్రహ్మణ్యం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement