నిన్ను.. నీ అయ్యను పాతరేసే రోజులు దగ్గర్లోనే.. | Mallu Bhatti Vikramarka comments on ktr | Sakshi
Sakshi News home page

నిన్ను.. నీ అయ్యను పాతరేసే రోజులు దగ్గర్లోనే..

May 8 2016 3:06 AM | Updated on Aug 15 2018 9:30 PM

నిన్ను.. నీ అయ్యను పాతరేసే రోజులు దగ్గర్లోనే.. - Sakshi

నిన్ను.. నీ అయ్యను పాతరేసే రోజులు దగ్గర్లోనే..

కాంగ్రెస్‌ను కాదు.. నిన్ను, నీ అయ్యను, నీ కుటుంబాన్ని పాతరేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

కేటీఆర్, కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన మల్లు భట్టి విక్రమార్క
నేలకొండపల్లి: కాంగ్రెస్‌ను కాదు.. నిన్ను, నీ అయ్యను, నీ కుటుంబాన్ని పాతరేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారంలో శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ పిల్లకాకి లాంటి వాడని, నోరు అదుపులో పెట్టుకోకుంటే పాలేరు ప్రజలు తరిమికొడతారని అన్నారు. కాంగ్రెస్‌ను పాతరేసే శక్తి ఆయనకు లేదని, కాంగ్రెస్ ఉండేలు దెబ్బ రుచి చూపిస్తామన్నారు.

ఖమ్మం జిల్లాలో రూ.10 వేల కోట్లు దోచుకునేందుకు కేసీఆర్, కేటీఆర్, తుమ్మల ప్రణాళికలు రూపొందించినట్లు ఆరోపించారు. అభివృద్ధి పేర కేటీఆర్ చేసిన అవినీతి బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఇటీవల ఆయన మంత్రిత్వ శాఖను మార్చారని ఆరోపించారు. దోపిడీ సొమ్ముతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసినట్లు పాలేరు ప్రజలను కొనాలని చూస్తే.. ఇక్కడే పాతరేస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement