ప్రేమజంట ఆత్మహత్య | Love couple commits suicide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Nov 7 2016 4:24 AM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రేమజంట ఆత్మహత్య - Sakshi

ప్రేమజంట ఆత్మహత్య

వారు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని ఆశపడ్డారు.

పెళ్లికి అంగీకరించని పెద్దలు
ఇంటి నుంచి పారిపోరుున ప్రేమికులు
తిరిగి వచ్చినా గ్రామంలోకి అనుమతించకపోవడంతో మనస్తాపం
విషపు గుళికలు తిని బలవన్మరణం
ఉగ్రారపు, అప్పయ్యగారి పల్లెల్లో విషాదం

 
వారు  ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని ఆశపడ్డారు. అందుకు పెద్దలు అంగీకరించలేదు. ప్రియురాలికి మరొక వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణరుుంచారు. దీంతో వారు ఇంటి నుంచి పారిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత పెద్దలు గ్రామంలోకి అనుమతించకపోవడంతో మనస్తాపం చెందారు. విషపు గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో  చోటుచేసుకుంది.
 
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలం అప్పయ్యగారిపల్లెకు చెందిన యమున(22)కు మదనపల్లె వాల్మీకివీధికి చెందిన సురేష్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు బాలాజీ పుట్టాడు. ఏడేళ్ల క్రితం యమున భర్త సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లో ఉంటూ మదనపల్లెలోని ఓ గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. చీకిలబైలు పంచాయతీ ఉగ్రారపుపల్లెకు చెందిన గురికాని శ్రీనివాసులు కుమారుడు సురేంద్ర(25) భవన నిర్మాణ పనులకు మదనపల్లెకు వెళ్లేవాడు. రోజూ వచ్చి వెళ్లే సమయంలో యమునతో పరిచయమైంది. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇరువురి పెద్దలకు తెలియడంతో మందలించారు. అంతేగాక యమునకు నెల క్రితం బి.కొత్తకోటకు వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చరుుంచారు. దీంతో సురేంద్ర, యమున ఇంటి నుంచి పారిపోయారు.

శనివారం రాత్రి స్వగ్రామానికి వచ్చారు. గ్రామంలోకి రావడానికి పెద్దలు అనుమతించకపోవడంతో మనస్తాపం చెందారు. ఊరికి సమీపంలోని బార్లపల్లె గుట్టలోకి చేరుకుని తినుబండారాల్లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయే ముందు చివరిసారిగా బంధువులకు ఫోన్ చేసి తాము బార్లపల్లె గుట్టలో ఆత్మహత్య చేసుకుంటుటున్నామని, తమ మృతదేహాలను తీసుకెళ్లాలని తెలిపారు. ఇరువురి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సమయంలో గుట్టలో గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామస్తులు గుట్టలో గాలిస్తుండగా యమున, సురేంద్ర మృతదేహాలు కనిపించారుు. ఇరువురి కుటుంబాల వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళి, ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement