శెట్టిపాలెం (వేములపల్లి) : లారీ, హార్వెస్టర్ ఢీకొన్న సంఘటన మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
లారీ, హార్వెస్టర్ ఢీ.. ఒకరు మృతి
Aug 19 2016 9:37 PM | Updated on Apr 3 2019 7:53 PM
శెట్టిపాలెం (వేములపల్లి) : లారీ, హార్వెస్టర్ ఢీకొన్న సంఘటన మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు నుంచి ఖమ్మం వెళ్తున్న హార్వెస్టర్ శెట్టిపాలెం మూలమలుపులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో హార్వెస్టర్ డ్రైవర్ సెల్వకుమార్ కిందపడి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అదే హార్వెస్టర్‌లో ఉన్న అనిల్, మర్రికంటి మైకెల్, ధర్మదురాయ్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జాఫర్ తెలిపారు.
Advertisement
Advertisement