అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దొంగను స్థానికులు చితకబాదడంతో మృతి చెందాడు.
తూప్రాన్(మెదక్): అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దొంగను స్థానికులు చితకబాదడంతో మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం హైదర్‌గూడలో ఆదివారం అర్ధరాత్రి దాటక జరిగింది.
గ్రామంలోని పోచయ్య ఇంట్లోకి రాత్రి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించడంతో అప్రమత్తమైన ఆయన.. స్థానికులతో కలిసి దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే స్పృహ కోల్పోయి పడి ఉన్న అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యుల నిర్ధరించారు. మృతుడు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన బాజీరావు(35)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.