నకిలీ బంగారం తాకట్టు.. 6 కోట్లు స్వాహా! | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారం తాకట్టు.. 6 కోట్లు స్వాహా!

Published Sun, Dec 11 2016 5:10 AM

loans with fake gold and crore rupees lose to banks

విశాఖ: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం పరిధిలోని పలు బ్యాంకుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఏకంగా రూ. 6 కోట్లు రుణాలు తీసుకున్న 12 మంది సభ్యుల ముఠాను ఎంవీపీ కాలనీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.

మూడు నెలల్లోనే 18 ఖాతాల ద్వారా ఈ రుణాలను పొందినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులలో విశాఖ, ఒడిశాలకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

 
Advertisement
 
Advertisement