నందికొట్కూరుకు చెందిన న్యాయవాది గుంపుల రవికుమార్(33) హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
న్యాయవాది అనుమానాస్పద మృతి
May 14 2017 12:12 AM | Updated on Sep 5 2017 11:05 AM
పంజగుట్ట: నందికొట్కూరుకు చెందిన న్యాయవాది గుంపుల రవికుమార్(33) హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసుల కథనం మేరకు.. రవికుమార్ హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ సుభాష్‌నగర్‌లోని ఓ ఇంట్లో మూడు నెలల క్రితం అద్దెకు దిగాడు. ఇతనికి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఈయన తన భార్యను 10 రోజుల క్రితం పుట్టింటికి పంపించారు. ఈయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. శుక్రవారం రాత్రి అతను మృతి చెంది ఉన్న విషయాన్ని గుర్తించిన పక్కింటి మహిళ స్థానికులకు చెప్పడంతో వారు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వాంతులు, రక్త విరోచనాలు కావడంవల్ల చనిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మృతుడి శరీరం నల్లగా మారిపోగా, కొద్ది దూరంలో థంసప్ బాటిల్ పడి ఉంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


