ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు | 'Lap tops' thiefs arrest | Sakshi
Sakshi News home page

ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు

Nov 9 2016 9:26 PM | Updated on Aug 20 2018 4:27 PM

ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు - Sakshi

ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు

విద్యార్థులు ఉండే గదులను టార్గెట్‌గా చేసుకుని ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్‌లు చోరీకి పాల్పడిన దొంగను అరెస్ట్‌ చేసి కోర్టుకు..

పట్నంబజారు: విద్యార్థులు ఉండే గదులను టార్గెట్‌గా చేసుకుని ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్‌లు చోరీకి పాల్పడిన దొంగను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. నగరంపాలెంలోని సీసీఎస్‌ స్టేషన్‌లో అడిషనల్‌ ఎస్పీ బీపీ తిరుపాల్, డీఎస్పీ పి. శ్రీనివాస్‌లు బుధవారం విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కారంపూడి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన పూల శివకృష్ణ చెడువ్యసనాలకు బానిసగా మారి తల్లిదండ్రులకు తెలియకుండా గుంటూరు వచ్చి నివాసం ఉంటున్నారు. గతంలోని గార్డెన్స్‌ సెంటరులో  విద్యార్థుల రూములో దూరి ల్యాబ్‌ట్యాప్, సెల్‌ఫోన్‌ల చోరీ చేశాడు. పాతగుంటూరు, నెహ్రూనగర్‌లో రెండు ద్విచక్ర వాహానాలు స్వాధీనం చేసుకున్నారు.   బుధవారం ఉదయం లక్ష్మీపురంలోని బాలుర వసతిగృహాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న శివకృష్ణను నిలిపి ద్విచక్ర వాహానంకు సంబందించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అడగటంతో పొంతన లేని సమాధానాలిచ్చాడు. దీనితో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో  చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు.  అతని నుంచి రూ.2 లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవటంతో ప్రతిభ కనబరిచిన సిబ్బంది వి.అనిల్, విజయ్, ఐటికోర్‌ బాలాజీ, శ్రీధర్‌ను అభినందించి రివార్డుల కోసం సిఫార్సులు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement