కేజేఆర్‌ ఫార్మా కళాశాల విద్యార్థినీల ఆందోళన | KJR college of Pharmacy students protest against accountant harassment | Sakshi
Sakshi News home page

డబుల్ మీనింగ్ డైలాగ్స్తో వేధింపులు

Nov 2 2016 5:45 PM | Updated on Nov 9 2018 4:46 PM

శ్రీనివాస్‌ - Sakshi

శ్రీనివాస్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేజేఆర్‌ ఫార్మా కళాశాల విద్యార్ధినీలు ఆందోళనకు దిగారు.

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేజేఆర్‌ ఫార్మా కళాశాల విద్యార్ధినీలు ఆందోళనకు దిగారు. కళాశాలలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తి విద్యార్ధినీలకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటమే కాకుండా అసభ్యకరమైన వీడియోలు పంపిస్తూ వేధిస్తున్నాడని విద్యార్థినీలు ఆరోపించారు. తక్షణమే శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
 
విద్యార్థినుల హాస్టల్కు శ్రీనివాసే ఇన్ఛార్జ్గా వ్యవహరించేవాడని, తమకు ఏ అవసరం అయినా అతని వద్దకే వెళ్లాల్సి వచ్చేందని, ఈ సందర్భంగా అసభ్య పదజాలంతో పాటు, వీడియోలు పంపించి వేధింపులకు పాల్పడేవాడని విద్యార్థినులు తెలిపారు. రెస్ట్ రూమ్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బ్లాక్ మెయిలింగ్ చేసేవాడని ఆరోపించారు. అతడిపై యాజమాన్యానికి, ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో విద్యార్థినులు తమకు న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగారు.
 
అయితే యాజమాన్యం మాత్రం శ్రీనివాస్తో క్షమాపణ చెప్పిస్తామని, విధుల నుంచి తొలగించేందుకు అంగీకరించకపోవడంతో విద్యార్థినులు తమ పట్టువీడలేదు. విద్యార్థినుల ఆందోళనలతో రంగంలోకి దిగిన పోలీసులు...శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. న్యాయం చేస్తామని పోలీసుల హామీతో విద్యార్థినీలు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement