నేడు జిల్లా స్థాయి ‘కళాఉత్సవ్‌–2016’ పోటీలు | kala utsav-2016 today | Sakshi
Sakshi News home page

నేడు జిల్లా స్థాయి ‘కళాఉత్సవ్‌–2016’ పోటీలు

Sep 6 2016 9:20 PM | Updated on Sep 4 2017 12:26 PM

స్థానిక జగన్నాథపురం పరి«ధి ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల ఏడో తేదీ బుధవారం జిల్లాస్థాయి ‘కళా ఉత్సవ్‌–2016’ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డివిజన్‌ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు.

కాకినాడ కల్చరల్‌ : 
స్థానిక జగన్నాథపురం పరి«ధి ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల ఏడో తేదీ బుధవారం జిల్లాస్థాయి ‘కళా ఉత్సవ్‌–2016’ పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డివిజన్‌ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. కళాఉత్సవ్‌–2016కు కన్వీనర్‌గా డివిజన్‌ అధికారి బి.డి. నాగేశ్వరావు వ్యవహరిస్తారని తెలిపారు. బృందగానం, బృంద నృత్యం, విజువల్‌ ఆర్ట్స్, థియేటర్‌ ఆర్ట్స్‌ అను నాలుగు అంశాల్లో పోటీలు జరగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమస్థానం పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికవుతారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement