ఐటా టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | ITA tennis tournament starts | Sakshi
Sakshi News home page

ఐటా టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Jul 30 2016 7:50 PM | Updated on Sep 4 2017 7:04 AM

రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని ఎన్టీఆర్‌ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు అన్నారు.

గుంటూరు స్పోర్ట్స్‌: రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని ఎన్టీఆర్‌  స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు అన్నారు. శనివారం  బృందావన్‌ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అండర్‌–14 బాల బాలికల ఐటా టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం అయ్యింది.  ముఖ్యఅతిథులు దామచర్ల శ్రీనివాసరావు, డాక్టర్‌ పోట్ల శివయ్య క్రీడాకారులను పరిచయం చేసుకొన్నారు.  ఈ సందర్భంగా పోట్ల శివయ్య క్రీడాకారులకు అల్పహరం అందించారు. టోర్నమెంట్‌లో ఆంధ్ర, తెలంగాణ , కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌ను ఐటా చీఫ్‌ రిఫరీ శ్రీకుమార్‌ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సంపత్‌ కుమార్, డాక్టర్‌ రవి, కమల్, చౌదరి, టెన్నిస్‌ కోచ్‌ శివ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement