భార్య తిట్టడంతో ఆగ్రహానికి గురైన భర్త భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.
పని పాట లేకండా.. ఇంట్లో కూర్చొని తింటున్నావని.. భార్య తిట్టడంతో ఆగ్రహానికి గురైన భర్త భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మూలబొడ్డవరం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సుక్రు తాగుడుకు బానిసై భార్యా బిడ్డలను వేధిస్తుండ టంతో.. మనస్తాపానికి గురైన భార్య భర్తను పదిమందిలో తిట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన సుక్రు కత్తితో భార్యపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.