రాయలసీమలోనే అతి పెద్ద మహిళా డిగ్రీ కాలేజీగా గుర్తింపు పొందిన కేవీఆర్ కాలేజీ అబివృద్ధికి దాతలు సహకరించాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ రాజేశ్వరి కోరారు.
కర్నూలు సిటీ: రాయలసీమలోనే అతి పెద్ద మహిళా డిగ్రీ కాలేజీగా గుర్తింపు పొందిన కేవీఆర్ కాలేజీ అబివృద్ధికి దాతలు సహకరించాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ రాజేశ్వరి కోరారు. శనివారం ఆ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. కాలేజీలో 1200 మంది విద్యార్థినులు ఉన్నారని.. వసతుల కోసం రూ. 3 కోట్లతో ప్రతిపాదనలు పంపినా అతీగతీ లేదన్నారు. వంద మంది విద్యార్థుల కోసం నిర్మించిన హస్టల్‌లో 1200 మంది ఉండాల్సి వస్తోదన్నారు. ఈ నెల 2 నుంచి8వ తేదీ వరకు కెవీఆర్ కాలేజీలో నాయకత్వ విద్య– నైపుణ్యం, సవాల్ అనే అంశంపై జాతీయ సెమినార్ జరుగుతుందన్నారు. కాలేజీ అకడమిక్ కమిటీ సభ్యులు విజయ్‌కూమార్‌రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ వీరాచారి, శ్రీదేవి, ఇందిరాశాంతి, సుబ్బరాజ్యమ్మ, వింద్యావతి, స్వప్నశ్రీ, డా.ఫామిదాబేగం, డా.జి అనిత తదితరులు పాల్గొన్నారు.