మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి ఆషాఢ పౌర్ణమి జాతర సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మొత్తం రూ.2,01,147 ఆదాయం వచ్చింది. అందులో హుండీ ద్వారా రూ.77,750, రశీదులు, ఇతరముల ద్వారా రూ.1,23,397 ఆదాయం వచ్చింది.
గూడెం హుండీ లెక్కింపు
Jul 20 2016 10:40 PM | Updated on Sep 4 2017 5:29 AM
దండేపల్లి : మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయానికి ఆషాఢ పౌర్ణమి జాతర సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మొత్తం రూ.2,01,147 ఆదాయం వచ్చింది. అందులో హుండీ ద్వారా రూ.77,750, రశీదులు, ఇతరముల ద్వారా రూ.1,23,397 ఆదాయం వచ్చింది. లెక్కింపును దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు, ఆదిలాబాద్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ రాజమొగిలి పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు వెంకటస్వామి, ఈవో పురుషోత్తమచార్యులు, వేదపారాయణదారు నారాయణశర్మ, ఆలయ సిబ్బంది, అర్చకులు, సత్యనారాయణస్వామి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement