నిరోష కుటుంబానికి ఆర్థిక సహాయం | financial Help to the family | Sakshi
Sakshi News home page

నిరోష కుటుంబానికి ఆర్థిక సహాయం

Sep 24 2016 11:01 PM | Updated on Sep 4 2017 2:48 PM

నిరోష కుటుంబానికి ఆర్థిక సహాయం

నిరోష కుటుంబానికి ఆర్థిక సహాయం

పాముకాటుతో మృతి చెందిన తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థిని

తెయూ (డిచ్‌పల్లి):
పాముకాటుతో మృతి చెందిన తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థిని నిరోష కుటుంబానికి తోటి విద్యార్థులు ఆర్థిక సాయం చేశారు. ఖమ్మం జిల్లా ఉసిరికాయపల్లి మండలం నడమడుగు గ్రామానికి చెందిన నిరోష తెయూలో ఎంఏ ఎకనామిక్స్‌లో చేరింది. గత నెలలో పాము కాటుతో ఆమె మృతి చెందింది. విద్యార్థిని ఆకస్మిక మృతితో ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని ఎకనామిక్స్‌ విద్యార్థులు, అధ్యాపకులు నిర్ణయించారు. ఈమేరకు విరాళాలు సేకరించారు. శనివారం నిరోష స్వస్థలానికి చీఫ్‌ వార్డెన్‌ రవీందర్‌రెడ్డి, రీసెర్చ్‌ స్కాలర్‌ సిద్ధలక్ష్మి, విద్యార్థులు సుజిత, ప్రసాద్‌ వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. తాము సేకరించిన రూ.41 వేలను వారికి అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement