లింగాపురం చర్చిలో వైఎస్‌ జగన్‌ ప్రార్థనలు | fifth day YS Jagan mohan reddy rythu bharosa yatra in kurnool | Sakshi
Sakshi News home page

లింగాపురం చర్చిలో వైఎస్‌ జగన్‌ ప్రార్థనలు

Jan 9 2017 10:18 AM | Updated on Jul 25 2018 4:42 PM

కర్నూలు జిల్లాలో వైఎస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది.

కర్నూలు: జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఆయన సోమవారం ఉదయం బండి ఆత్మకూరు మండలం లింగాపురం నుంచి అయిదోరోజు యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు లింగాపురం చర్చిలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

లింగాపురం నుంచి ఓంకారం, కడమల కాల్వ, వెంగళరెడ్డిపేట వరకూ రోడ్‌ షో నిర్వహిస్తారు. అనంతరం బి.కోడూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చాంద్‌భాషా కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్‌ షో వెంగళరెడ్డి పేట నుంచి నేరుగా పుట్టుపల్లె, అబ్బీపురం మీదగా మండలం కేంద్రమైన ఎం.తిమ్మాపురం చేరుకుంటుంది. అక్కడ దూదేకుల చిన్నస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బుక్కాపురం వరకూ రోడ్‌ షో చేపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement