విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer died with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Nov 20 2016 12:56 AM | Updated on Oct 1 2018 2:44 PM

మండలంలోని ఎర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన రైతు గంగుల వెంకటేశ్వర రెడ్డి (38) విద్యుదాఘాతంతో శనివారం సాయంత్రం మృతి చెందాడు.

రుద్రవరం: మండలంలోని ఎర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన రైతు గంగుల వెంకటేశ్వర రెడ్డి (38) విద్యుదాఘాతంతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. విద్యుత్‌ అధికారులు స్థంభాలు మంజూరు చేయడంతో వెంకటేశ్వరరెడ్డి.. గ్రామ సమీపంలోని సొంత పొలంలో కూలీల చేత వాటిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. విద్యుత్‌ స్థంభానికి 11 కేవీ విద్యుత్‌ తీగలు తగలడంతో దానిని పట్టుకొని ఉన్న వెంకటేశ్వరరెడ్డి కేకవేసి అక్కడికి అక్కడనే మృతి చెందాడు.కూలీలు ముగ్గురు పరుగులు తీసి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వెంకటేశ్వర రెడ్డి 15 రోజుల నుంచి అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. దీక్షలో ఉన్న రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయనకు భార్య సరిత, కుమారులు శరత్‌ చంద్రారెడ్డి, రాఘవేంద్రారెడ్డిలు ఉన్నారు. సరిత.. రుద్రవరం ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హనుమంతయ్య ఎర్రగుడిదిన్నె గ్రామం చేరుకొని ప్రమాదం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement