మద్యంమత్తులో ఒళ్ళు కాల్చుకొని వ్యక్తి మృతి | drinker burning in fire | Sakshi
Sakshi News home page

మద్యంమత్తులో ఒళ్ళు కాల్చుకొని వ్యక్తి మృతి

Jan 2 2017 10:17 PM | Updated on Jul 18 2019 2:26 PM

నరసరావుపేటరూరల్ççç: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోలు పోసుకొని కాల్చుకొని దుర్మరణానికి గురైన సంఘటన మండలంలోని జొన్నలగడ్డలో ఆదివారం రాత్రి జరిగింది.

 
నరసరావుపేటరూరల్ççç: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోలు పోసుకొని  కాల్చుకొని దుర్మరణానికి గురైన సంఘటన మండలంలోని జొన్నలగడ్డలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన గారపాటి లోకరాజు (27) గత ఆరు నెలలుగా జొన్నలగడ్డ రోడ్డులోని బ్రిక్స్‌ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి మైకంలో పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన లోకరాజును గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్టు,  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏవీ బ్రహ్మం తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement