పాలకోడేరు : అతనో కానిస్టేబుల్. ఓ యువతిని నమ్మించి లోబరుచుకుని శారీరక వాంఛ తీర్చుకున్నాడు. గర్భిణిని చేశాడు. ఆ తర్వాత తనకు సంబంధం లేదు పొమ్మన్నాడు. దీంతో చేసేది లేక ఆ యువతి న్యాయం చేయాలని గురువారం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
నమ్మించి వంచించాడు
Aug 26 2016 12:29 AM | Updated on Aug 21 2018 8:23 PM
పాలకోడేరు : అతనో కానిస్టేబుల్. ఓ యువతిని నమ్మించి లోబరుచుకుని శారీరక వాంఛ తీర్చుకున్నాడు. గర్భిణిని చేశాడు. ఆ తర్వాత తనకు సంబంధం లేదు పొమ్మన్నాడు. దీంతో చేసేది లేక ఆ యువతి న్యాయం చేయాలని గురువారం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. పాలకోడేరు మండలం శృంగవృక్షంలోని పాలపర్తిపేటకు చెందిన 27 ఏళ్ల వాకపల్లి శ్వేతన్ 2012 తెలంగాణ స్పెషల్ పోలీస్ ఏడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఆ సమయంలో అదే వీధిలో డిగ్రీ చదువుతున్న 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాంఛలు తీర్చుకున్నాడు. ఎవరూ లేకుండా చూసి పసుపుతాడు కూడా కట్టాడు. ప్రస్తుతం ఆ యువతి నెలుగో నెల గర్భిణి. దీంతో భార్యగా అంగీకరించాలని ఆమె శ్వేతన్‌ను వేడుకుంది. దీనికి అతను నిరాకరించాడు. దీంతో న్యాయం కోసం ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమవరం రూరల్ సీఐ జయసూర్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై సి.హెచ్.రమేష్‌బాబు తెలిపారు.
Advertisement
Advertisement