క్రమశిక్షణతోనే ఉన్నత చదువులు | committment leads student to achive higher says DEO | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతోనే ఉన్నత చదువులు

Jul 16 2016 7:28 PM | Updated on Sep 4 2017 5:01 AM

క్రమశిక్షణతోనే ఉన్నత చదువులు

క్రమశిక్షణతోనే ఉన్నత చదువులు

విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నపుడే ఉన్నత చదువులు చదవడంలో విజయం సాధిస్తారని జిల్లా వృత్తి విద్యాధికారి ప్రభాకర్ అన్నారు.

ఆర్మూర్: విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నపుడే ఉన్నత చదువులు చదవడంలో విజయం సాధిస్తారని జిల్లా వృత్తి విద్యాధికారి ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ శివారులోని పిప్రి రోడ్డులో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కళాశాల కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. తరగతులు నిర్వహిస్తున్న తీరును, అధ్యాపకులు బోధిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు.

చదువులతో పాటు వి ద్యార్థులు తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను గౌరవించాలనే సంస్కారాన్ని అలవర్చుకోవాలన్నారు. అ నంతరం కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నా టారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ రఘురాజ్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement