బాల్యమిత్రునికి కేసీఆర్ పట్టం | cm friend select for market commitee chairman | Sakshi
Sakshi News home page

బాల్యమిత్రునికి కేసీఆర్ పట్టం

Apr 23 2016 3:51 AM | Updated on Aug 15 2018 9:30 PM

బాల్యమిత్రునికి కేసీఆర్ పట్టం - Sakshi

బాల్యమిత్రునికి కేసీఆర్ పట్టం

ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జహంగీర్ నియమితులయ్యారు.

గజ్వేల్ : ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జహంగీర్ నియమితులయ్యారు. శుక్రవారం ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ములుగు మండల టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా పనిచేస్తున్న జహంగీర్ కేసీఆర్‌కు బాల్యమిత్రుడు. ప్రస్తుతం ఫామ్‌హౌస్ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన మిత్రునికి కేసీఆర్ ఊహించిన విధంగానే మార్కెట్ కమిటీ పదవిని కట్టబెట్టారు. ఈ సందర్భంగా జహంగీర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కేసీఆర్ తనకు ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తూ తెలంగాణలోనే వంటిమామిడిని నెంబర్‌వన్ మార్కెట్ కమిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement