అలాగైతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా! | Sakshi
Sakshi News home page

అలాగైతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా!

Published Fri, Jun 24 2016 3:48 AM

అలాగైతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా! - Sakshi

12 శాతం రిజర్వేషన్లపై సీఎల్పీ నేత జానారెడ్డి సవాల్
మిర్యాలగూడ: ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ నేతలు చెప్పేవన్నీ కట్టుకథలుగా ఆయన అభివర్ణించారు. నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి తమకు నానా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. కాంగ్రెస్‌వారు పేదలకు గూడు కట్టిస్తే మేము గుడి కట్టిస్తామని చెప్పిన కేసీఆర్ అక్కడక్కడా పది డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి మభ్యపెడుతున్నారని విమర్శించారు.

మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో ఇరవై ఏళ్ల క్రితమే ఇంటింటికీ నల్లా కనెక్షన్‌లు ఇప్పిం చామని, ఆయన ఇప్పుడు మిషన్ భగీరథ పేరుతో కొత్తగా ఇచ్చేది ఏమీ లేదన్నారు.  ఒక పం టకు నీళ్లివ్వడానికే ఇంజనీర్లు ప్రాజెక్టుకు డిజైన్ చేస్తారని, కానీ కేసీఆర్ మాత్రం రెండు పంటలకు నీళ్లిస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శిం చారు. ప్రాజెక్టుల పరిధిలో రెండు పంటలకు సాగు నీరందిస్తే తాను కేసీఆర్‌కు ప్రచార సారథిగా ఉంటానని ప్రకటించారు.

నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు పార్టీ మారుతున్నట్లు తనకు చెప్పారనడం అబద్ధమని  జానారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారే విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే తాను వినలేదన్నారు. పార్టీలు మారినవారికి కాలమే సమాధానం చెబుతుం దని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement