బెజవాడ బస్టాండ్‌లో సినిమా థియేటర్ | Sakshi
Sakshi News home page

బెజవాడ బస్టాండ్‌లో సినిమా థియేటర్

Published Thu, Jun 2 2016 8:54 AM

బెజవాడ బస్టాండ్‌లో సినిమా థియేటర్ - Sakshi

విజయవాడ : పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో సినిమా థియేటర్ ప్రారంభానికి సిద్ధమైంది. బస్టాండ్‌లో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మల్టీప్లెక్స్ మినీ థియేటర్ ఏర్పాటు చేయాలని ఎండీ నండూరి సాంబశివరావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆ అవకాశాన్ని వైస్క్రీన్ సంస్థ దక్కించుకుంది.

పనులు పూర్తయి ప్రస్తుతం థియేటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రెండు స్క్రీన్‌లు ఏర్పాటు చేసి, ఒక్కో స్క్రీన్‌లో 128 సీట్లతో రోజుకు 5 ఆటలు ప్రదర్శిస్తారు. టిక్కెట్టు రూ.80 ఉంటుంది. రాత్రి వేళలో తక్కువ ధరకు టికెట్టు నిర్ణయించి పలు అంశాల కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.  
 
6న ప్రారంభం..
ఈ నెల 6వ తేదీ సినిమా థియేటర్‌ను ప్రారంభించనున్నట్లు వైస్క్రీన్ సంస్థ ప్రొప్రయిటర్ వైవీ రత్నం తెలిపారు. ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement