చిరంజీవి అభిమానుల అన్నదానం | chiranjeevi fans donate the food | Sakshi
Sakshi News home page

చిరంజీవి అభిమానుల అన్నదానం

Aug 19 2016 1:06 AM | Updated on Sep 4 2017 9:50 AM

సినీనటుడు చిరంజీవి (ఆగస్టు 22) 61వ జన్మదినాన్ని పురస్కరించుకుని హిందూపురం చిరంజీవి అభిమానులు సేవామందిరంలోని వృద్ధులకు గురువారం అన్నదానం చేశారు.

హిందూపురం అర్బన్‌ : సినీనటుడు చిరంజీవి (ఆగస్టు 22) 61వ జన్మదినాన్ని పురస్కరించుకుని హిందూపురం చిరంజీవి అభిమానులు సేవామందిరంలోని వృద్ధులకు గురువారం అన్నదానం చేశారు. చిరంజీవి యువత జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు ఇందాద్‌ ఆధ్వర్యంలో మాంసాహార భోజనంతో పాటు పండ్లు అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈసందర్భంగా చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదరెడ్డి, ఇందాద్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్న కథానాయకుడు చిరంజీవి అన్నారు. సినిమాల్లోనే కాకుండా బ్లడ్‌బ్యాంక్, ఐ బ్యాంక్‌ తదితర కార్యక్రమాలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు అమర్, సుబ్రమణ్యం, మల్లెపూల మధు, నాగరాజు, కదిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement