ఘోరం జరిగిపోయింది: చంద్రబాబు | chandrababu respond on pushkaralu Stampede | Sakshi
Sakshi News home page

ఘోరం జరిగిపోయింది: చంద్రబాబు

Jul 14 2015 12:41 PM | Updated on Aug 1 2018 5:04 PM

ఘోరం జరిగిపోయింది: చంద్రబాబు - Sakshi

ఘోరం జరిగిపోయింది: చంద్రబాబు

పుష్కరాలు పూర్తయ్యేవరకు రాజమండ్రిలోనే ఉంటానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఘోరం జరిపోయిందన్నారు.

రాజమండ్రి: పుష్కరాలు పూర్తయ్యేవరకు రాజమండ్రిలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఘోరం జరిపోయిందన్నారు. పుణ్యకార్యక్రమానికి వచ్చి ఇలా జరగడం దారుణమన్నరు. తొక్కిసలాట గురించి తెలిసిన వెంటనే కంట్రోల్ రూముకు చేరుకున్నానని తెలిపారు.

తొక్కిసలాటలో గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాసుప్రతిలో ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. పుష్కరాలు పూర్తయ్యాక ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. భక్తుల రద్దీని అదుపు చేసేందుకు చాలా ప్రయత్నించారని చెప్పారు. పుష్కార ఏర్పాట్లలో లోపాలు జరిగాయని ఒప్పుకున్నారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తొక్కిలలాట ఘటనలో 32మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement