అక్రమ మద్యం నిల్వల పట్టివేత | Capture illicit liquor stores | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం నిల్వల పట్టివేత

Jun 27 2016 8:33 AM | Updated on Sep 4 2017 3:28 AM

అక్రమ మద్యం నిల్వల పట్టివేత

అక్రమ మద్యం నిల్వల పట్టివేత

మండలంలోని కర్ణమామిడి గ్రామంలో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు...

మంచిర్యాల: మండలంలోని కర్ణమామిడి గ్రామంలో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచి మద్యంను పట్టుకున్నారు. ఈ సందర్భంగా హాజీపూన్ ఎస్సై తహసీనుద్దీన్ మాట్లాడుతూ, జనమైత్రి పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జనమైత్రిపై ప్రజలకు అవగాహన కలిపిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ఇందులో భాగంగా చైతన్యంతో గ్రామాల్లో జరిగే అక్రమాలు, అన్యాయాలపై సమాచారం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. తనకు వచ్చిన సమాచారం మేరకు కర్ణమామిడిలోని లగిశెట్టి తిరుపతి దుకాణంలో తనిఖీలు నిర్వహించగా 37 బీర్లు, 3 విస్కీ బాటిళ్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని అతని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తనిఖీల్లో కర్ణమామిడి జనమైత్రి పోలీస్ అధికారి సంపత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement