కేంద్రమంత్రి గోయల్కు చేదు అనుభవం | Cabinet minister Piyush Goyal faces bitter experience at puttaparthi | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి గోయల్కు చేదు అనుభవం

Jul 12 2016 12:53 PM | Updated on Sep 4 2017 4:42 AM

కేంద్ర విద్యుత్ శాఖమంత్రి పియూష్ గోయల్కు పుట్టపర్తిలో మంగళవారం చేదు అనుభవం ఎదురైంది.

అనంతపురం: కేంద్ర విద్యుత్ శాఖమంత్రి పియూష్ గోయల్కు పుట్టపర్తిలో మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం చేసుకున్నారు. అయితే పుట్టపర్తి విమానాశ్రయ అధికారులు మాత్రం కేంద్రమంత్రి హెలికాప్టర్ను అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. 24 గంటల ముందే అనుమతి తీసుకోవాలని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. దాంతో చేసేదేమీ లేక పియూష్ గోయల్ రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళ్లారు.

కాగా పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ సమ్మేళన కార్యక్రమానికి కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇవాళ ఉదయం ఆయన యూత్ ఫెస్టివల్ను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement