'లవ్ హ్యుమన్.. సర్వ్ హ్యూమన్’ అనే థీమ్‌తో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ సమ్మేళనాన్ని కేంద్రమంత్రి పియూష్ గోయల్ మంగళవారం ప్రారంభించారు.
అనంతపురం : 'లవ్ హ్యుమన్.. సర్వ్ హ్యూమన్’ అనే థీమ్‌తో పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ సమ్మేళనాన్ని కేంద్రమంత్రి పియూష్ గోయల్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. కాగా మూడురోజుల పాటు జరగనున్న ఈ యూత్ కాంక్లేవ్కు 69 దేశాలనుంచి సుమారు 3వేలమంది విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. మరోవైపు ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు.