సంక్షేమ పథకాల అమల్లో విఫలం | bjp tiranga yatra at bejjanki | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాల అమల్లో విఫలం

Aug 25 2016 10:33 PM | Updated on Mar 29 2019 5:32 PM

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం బీజేపీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో చేపట్టిన తిరంగ యాత్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

 బెజ్జంకి: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం బీజేపీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో చేపట్టిన తిరంగ యాత్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని   అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 2019లో అధికారమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మానకొండూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ నాగరాజు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సుభాష్, మండల అధ్యక్షులు నాగరాజు, పార్లమెంట్‌ కోకన్వీనర్‌ చంద్రారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్‌ మహిపాల్‌రెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, మల్లేశం, శంకర్, నారాయణరెడ్డి, రాజు, మల్లేశం, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement