ప్రభుత్వ వైఫల్యాలపై శంఖారావం పూరిస్తామని బీజేపీ ఎల్పీ నేత కిషన్‌రెడ్డి అన్నారు.
శంషాబాద్ రూరల్(రంగారెడ్డి): రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని బలోపేతం చేయటంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై శంఖారావం పూరిస్తామని బీజేపీ ఎల్పీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రధానమంత్రి మోదీ సభను విజయవంతం చేయటంపై ఈ సందర్భంగా చర్చించారు.