పెళ్లికి ముందు రోజు వరుడి ఆత్మహత్య | Before the wedding day, the groom's suicide | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు రోజు వరుడి ఆత్మహత్య

Nov 21 2016 1:28 AM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లికి ముందు రోజు వరుడి  ఆత్మహత్య - Sakshi

పెళ్లికి ముందు రోజు వరుడి ఆత్మహత్య

పెళ్లింట విషాదం అలముకుంది. మంగళమేళాలు మోగాల్సిన ఇంట చావు డప్పు మోగింది.

బర్మాకాలనీలో ఘటన

మల్కాపురం : పెళ్లింట విషాదం అలముకుంది. మంగళమేళాలు మోగాల్సిన ఇంట చావు డప్పు మోగింది. పచ్చని పెళ్లి పందిరిలో పెళ్లికొడుకులా కూర్చుంటాడనుకున్న కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. వివరాలిలా ఉన్నారుు. 48వ వార్డు బర్మాకాలనీలో గంధవరపు జెంబో, మహాలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులలో చివరివాడైన శివ(25)కు విజయనగరం ప్రాంతానికి చెందిన ఓ యువతితో శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా పెళ్లి రాట ముహూర్తం శుక్రవారం ఉదయం కావడంతో ఇంట్లో పడుకున్న శివను లేపేందుకు కుటుంబ సభ్యులు వెళ్లారు. ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో కిటీకిలోంచి చూడగ.. గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరిపోసుకొని వేలాడుతూ శివ కనిపించాడు. భయందోళన చెందిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూస్తే అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసును సీఐ కేశవరావు ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ బి.ప్రసాద్‌రావు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ వ్యవహారమే మృతికి కారణం
శివ వృత్తిరీత్యా పెరుుంటర్. ఇంటికి సమీపాన ఉంటున్న ఓ యువతితో పరిచయం ఉంది. అది ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని శివకు ఉండేదని, అరుుతే ధైర్యం చేసి పెద్దలకు చెప్పలేక తల్లడిల్లేవాడు. ఇంతలో పెద్దలు వేరే యువతితో పెళ్లి నిశ్చరుుంచడంతో మనస్థాపానికి గురై శివ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

కన్నీటి వరద
తెల్లవారితే పెళ్లిరాట. దీంతో ఆ పనుల్లో శివ కుటుంబ సభ్యులు బిజీబిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించి సామగ్రి అంతా సమకూర్చారు. పెళ్లి కొడుకు వస్తే ఆ శుభకార్యం చేద్దామనుకున్నారు. ఇంతలో తట్టుకోలేని నిజం వారిని అతలాకుతలం చేసింది. ‘పెళ్లి ఇష్టం లేకపోతే ఇలా చేస్తావా’అంటూ శివ తల్లిదండ్రులు భోరున విలపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement