కట్టేసి కొట్టారు.. | bakery owner tied and beated to autodriver for four thiusend rupees | Sakshi
Sakshi News home page

కట్టేసి కొట్టారు..

Jun 28 2016 4:15 AM | Updated on Sep 4 2017 3:33 AM

కట్టేసి కొట్టారు..

కట్టేసి కొట్టారు..

అప్పుగా తీసుకున్న దాంట్లో బాకీ ఉన్న రూ.4వేలు వెంటనే చెల్లించాలని ఓ బేకరీ వ్యాపారి ఆటో డ్రైవర్‌ను కిటికీకి కట్టేసి కొట్టాడు.

బాకీ డబ్బుల కోసం ఆటో డ్రైవర్‌పై దాష్టీకం
ఖమ్మం అర్బన్: అప్పుగా తీసుకున్న దాంట్లో బాకీ ఉన్న రూ.4వేలు వెంటనే చెల్లించాలని ఓ బేకరీ వ్యాపారి ఆటో డ్రైవర్‌ను కిటికీకి కట్టేసి కొట్టాడు. బాధితుడు పాండురంగాపురానికి చెందిన రవి తెలిపిన వివరాల ప్రకారం..తన ఆటోని బల్లేపల్లిలోని బేకరీలో తయారు చేసిన సరుకులను దుకాణాలకు సరఫరా చేసేందుకు కిరాయికి తిప్పేవాడు. కొంతకాలం క్రితం బేకరీ యజమాని వెంకటేశ్వరరెడ్డి వద్ద అప్పు తీసుకున్నాడు. డబ్బులను రోజువారీగా కిరాయిలో కట్ చేయించుకున్నాడు.

ఇంకా రూ.4వేలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల ఆ డబ్బు కోసం యజమాని ఒత్తిడి చేయడంతో..రెండు రోజులుగా ఆటోను తిప్పట్లేదు. ఓనర్ అతడి ఇంటికి వచ్చి డబ్బుల విషయంలో నిలదీయడంతో..అవమానంగా భావించిన ఆటో డ్రైవర్ సోమవారం బేకరీ వద్దకు వచ్చి చెట్టుకు ఉరి వేసుకునేందుకు యత్నించాడు. గమనించిన యజమాని..అతడిని బేకరీలోకి తీసుకెళ్లి కిటికీకి కట్టేసి కొట్టాడు. ఈ విషయాన్ని అతడి భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. కంగారుపడిన ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఆపారు. సమాచారం అందుకున్న పోలీసులు బేకరీ వద్దకు చేరుకొని ఆటో డ్రైవర్ కట్లు విప్పి విడిపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement