
2న ఆటోల బంద్
2న దేశ వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు.
సుల్తాన్‌బజార్: ఆటో డ్రైవర్లకు నష్టపరిచే విధంగా ఉన్న రోడ్డు రవాణా, భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటో సంఘాల జేఏసీ నాయకులు బి.వెంకటేశం (ఏఐటీయూసీ), మహ్మద్ అమానుల్లాఖాన్ తెలిపారు. బుధవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..
రవాణా రంగాన్ని ప్రైవేటీకరించి, విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సెప్టెంబర్ 2న ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు జరిగే ర్యాలీలో ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు మహ్మద్ ఫారుఖ్, వి.కిరణ్, ఎంఎ.సలీం, సత్తిరెడ్డి పాల్గొన్నారు.