ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడ్‌! | Area Hospital to upgrade! | Sakshi
Sakshi News home page

ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడ్‌!

Aug 29 2016 12:03 AM | Updated on Sep 4 2017 11:19 AM

ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడ్‌!

ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడ్‌!

మానుకోట ఏరియా ఆస్ప త్రి అప్‌గ్రేడ్‌ కానుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా మానుకోట జిల్లా ఏర్పడిన తర్వాత ఆస్పత్రి అభివృద్ధికి మోక్షం లభించనుంది. ప్రస్తుతం 300 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలనే డిమాండ్‌ ఉండగా, జిల్లా ఏర్పాటుతో మరింత ఎక్కువ పడకలు, మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

  • మానుకోట జిల్లాతో మోక్షం లభించే అవకాశం
  • బ్లడ్‌బ్యాంక్, మెరుగైన వైద్యానికి మోక్షం
  • మహబూబాబాద్‌ : మానుకోట ఏరియా ఆస్ప త్రి అప్‌గ్రేడ్‌ కానుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా మానుకోట జిల్లా ఏర్పడిన తర్వాత ఆస్పత్రి అభివృద్ధికి మోక్షం లభించనుంది. ప్రస్తుతం 300 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలనే డిమాండ్‌ ఉండగా, జిల్లా ఏర్పాటుతో మరింత ఎక్కువ పడకలు, మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి తరహాలో అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. మానుకోట ఏరియా ఆస్పత్రిని 1999సంవత్సరంలో నిర్మిం చారు. వంద పడకల ఆస్పత్రే అయినప్పటికీ మానుకోట డివిజన్‌తోపాటు ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, ఇల్లందు నుంచి కూడా రోగు లు ఇక్కడికి వస్తుంటారు. రోజూ ఓపీలో 800 మంది నుంచి వెయ్యి మంది వరకు వైద్యులు చూస్తారు. వైద్యులు, సిబ్బంది సరిపడ సంఖ్య లో ఉన్నప్పటికీ బెడ్లు ఎక్కువగా లేవు. దీంతో రోగులకు వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మానుకోటలోని జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్యులకు పనిభారం పెరుగుతోంది. వైద్యుల మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయి. వా రికి ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉండటం వల్ల కూడా విభేదాలు ఏర్పడి గ్రూపులుగా ఏర్పడ్డారు.
     
    అందుబాటులో ఉన్నతాధికారులు
    అయితే జిల్లా కాబోతున్న తరుణంలో డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌ఓ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉండనున్నారు. బ్లడ్‌బ్యాంక్‌ అందుబాటులోకి వస్తుంది. అన్ని విభాగాలకు డాక్టర్లు వస్తా రు. ఫిజీషియన్, సివిల్‌ సర్జన్స్, తదితర వైద్యు లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రి కూడా 500 పడకల ఆస్పత్రిగా ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాగా ఏర్పడిన తర్వాత ఏరియా ఆస్పత్రి అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంద ని, సిటీ స్కాన్‌ వంట సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందుతుందని పలువురు అంటున్నా రు. ఆస్పత్రి అప్‌గ్రేడ్‌ కోసం కొన్నేళ్లుగా ఆందోళనా ఫలితం లేకపోయింది. చివరికి జిల్లా ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement