breaking news
manukota Area Hospital
-
పాసుపుస్తకం కోసం ముగ్గురి ఆత్మహత్యాయత్నం
కేసముద్రం: తమకు వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదు చేయకపోవడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వల్లాల రవికుమార్ తన తండ్రి చంద్రయ్య ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. వారసత్వంగా వచ్చిన భూమిలో కుమారుడు రవికుమార్ సాగు చేసుకుంటున్నాడు. భూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకాలు రాలేదని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తనకున్న 3.12 ఎకరాల భూమికి గాను రైతుబంధు ద్వారా రెండు విడతల్లో పెట్టుబడి సహాయంగా ప్రభుత్వం నుంచి బాధితుడికి మూడెకరాలకు సంబంధించిన డబ్బులు అందాయి. మిగతా భూమిని రికార్డు ల్లో నమోదు చేసి, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని అధికారులను కోరుతూ వచ్చాడు. ఈ క్రమంలో సోమ వారం రవికుమార్, తన చెల్లెళ్లు రాజమ్మ, లలిత కార్యాలయంలోని గ్రీవెన్స్‌లో íఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ అక్కడున్న రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. అధికారులు స్పందించకపోగా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా మాట్లాడటంతో రవికుమార్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగబోగా, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఆటోలో ఆ ముగ్గుర్ని ఇంటికి పంపించారు. డబ్బులు ఇవ్వటం లేదనే సాకుతోనే అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకుండా రోజూ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితులు మనోవేదనకు గురయ్యారు. ఇంటికి చేరుకున్న అన్నా, ఇద్దరు చెల్లెళ్లు్ల తమ భూమి సమస్య పరిష్కారం కాదని మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు వారిని 108లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. -
ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడ్!
మానుకోట జిల్లాతో మోక్షం లభించే అవకాశం బ్లడ్‌బ్యాంక్, మెరుగైన వైద్యానికి మోక్షం మహబూబాబాద్ : మానుకోట ఏరియా ఆస్ప త్రి అప్‌గ్రేడ్ కానుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా మానుకోట జిల్లా ఏర్పడిన తర్వాత ఆస్పత్రి అభివృద్ధికి మోక్షం లభించనుంది. ప్రస్తుతం 300 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలనే డిమాండ్ ఉండగా, జిల్లా ఏర్పాటుతో మరింత ఎక్కువ పడకలు, మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి తరహాలో అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. మానుకోట ఏరియా ఆస్పత్రిని 1999సంవత్సరంలో నిర్మిం చారు. వంద పడకల ఆస్పత్రే అయినప్పటికీ మానుకోట డివిజన్‌తోపాటు ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, ఇల్లందు నుంచి కూడా రోగు లు ఇక్కడికి వస్తుంటారు. రోజూ ఓపీలో 800 మంది నుంచి వెయ్యి మంది వరకు వైద్యులు చూస్తారు. వైద్యులు, సిబ్బంది సరిపడ సంఖ్య లో ఉన్నప్పటికీ బెడ్లు ఎక్కువగా లేవు. దీంతో రోగులకు వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మానుకోటలోని జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్యులకు పనిభారం పెరుగుతోంది. వైద్యుల మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయి. వా రికి ప్రైవేట్ ఆస్పత్రులు ఉండటం వల్ల కూడా విభేదాలు ఏర్పడి గ్రూపులుగా ఏర్పడ్డారు. అందుబాటులో ఉన్నతాధికారులు అయితే జిల్లా కాబోతున్న తరుణంలో డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉండనున్నారు. బ్లడ్‌బ్యాంక్ అందుబాటులోకి వస్తుంది. అన్ని విభాగాలకు డాక్టర్లు వస్తా రు. ఫిజీషియన్, సివిల్ సర్జన్స్, తదితర వైద్యు లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రి కూడా 500 పడకల ఆస్పత్రిగా ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాగా ఏర్పడిన తర్వాత ఏరియా ఆస్పత్రి అన్నివిధాలా అభివృద్ధి చెందుతుంద ని, సిటీ స్కాన్ వంట సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందుతుందని పలువురు అంటున్నా రు. ఆస్పత్రి అప్‌గ్రేడ్ కోసం కొన్నేళ్లుగా ఆందోళనా ఫలితం లేకపోయింది. చివరికి జిల్లా ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరనుంది.