అల్‌మేవ ఎన్నికలు ఏకగ్రీవం | almeva elections Unanimous | Sakshi
Sakshi News home page

అల్‌మేవ ఎన్నికలు ఏకగ్రీవం

Oct 9 2016 12:28 AM | Updated on Aug 14 2018 5:56 PM

ఆల్‌ మైనార్టీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేన్‌(ఆల్‌మేవ)జిల్లా శాఖ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయి

–జిల్లా అధ్యక్షుడిగా సర్దార్‌ అబ్దుల్‌ హమీద్‌ రెండోసారి ఎన్నిక 
–ప్రధాన కార్యదర్శిగా మహహ్మద్‌ రియాజ్‌బాషా
కర్నూలు(అగ్రికల్చర్‌): ఆల్‌ మైనార్టీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేన్‌(ఆల్‌మేవ)జిల్లా శాఖ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌ కర్నూలు ఎస్‌ఈ కార్యాలయంలో పనిచేస్తున్న సర్దార్‌ అబ్దుల్‌హమీద్‌  జిల్లా అధ్యక్షుడిగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల కార్యక్రమాన్ని ఆల్‌మేవ వ్యవస్థాపకులు సయ్యద్‌ హుసేన్‌ పర్యవేక్షించారు. ఎన్నికల అధికారులుగా రిటైర్డ్‌ తహసీల్దారు అజయ్‌కుమార్, రిటైర్డ్‌ ఎంపీడీఓ ఉమర్‌బేగ్‌లు వ్యవహరించారు. అ«ధ్యక్షుడుగా అబ్దుల్‌హమీద్, ప్రదాన కార్యాదర్శిగా మహమ్మద్‌ రియాజ్‌ బాషా, వర్కింగ్‌ ప్రసిడెంటుగా మహబూబ్‌బాష, అసోషియేట్‌ అద్యక్షుడుగా ఎం.దాదాపీర్, కోశాధికారిగా షపిఅహమ్మద్, ఉపాధ్యక్షులుగా మస్రత్‌ఆలీఖాన్, హసన్‌బాష, అదనపు ప్రదానకార్యదర్శిగా ఎం. జాకీర్‌హుసేన్, లీగల్‌ అడ్వయిజర్‌గా పివి ప్రసాద్‌రావు, మహిళా కార్యదర్శులుగా హేమలత, జీనత్‌జహ, ఇందిరశాంతి, కల్చరల్‌ కార్యదర్శిగా హజిమున్నీసాబేగంలు, రాష్ట్ర కార్యదర్శిగా షంషుద్ధిన్‌  ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement