గుర్తింపు రద్దయిన కాలేజీలకు ఊరట.. | All engineering colleges will chance to eamcet councelling | Sakshi
Sakshi News home page

గుర్తింపు రద్దయిన కాలేజీలకు ఊరట..

Jul 15 2015 1:52 PM | Updated on Aug 31 2018 9:15 PM

తెలంగాణలో గుర్తింపు రద్దయిన ఇంజినీరింగ్ కాలేజీలపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో డివిజన్ బెంచ్ కొన్ని మార్పులు చేసింది.

హైదరాబాద్ : తెలంగాణలో గుర్తింపు రద్దయిన ఇంజినీరింగ్ కాలేజీలపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో డివిజన్ బెంచ్ కొన్ని మార్పులు చేసింది. గుర్తింపు రద్దయిన ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయంపై ఈ 30లోగా అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలని డివిజన్ పేర్కొంది. వచ్చే నెల 4న తదుపరి విచారణ చేపట్టనుంది. సరైన ప్రమాణాలు పాటించని కాలేజీల గుర్తింపు రద్దు చేసే అధికారం జేఎన్టీయూకు ఉందని కూడా తెలిపింది.

3 రోజుల్లో అధికారులు తనిఖీలు మొదలు పెట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు రద్దయిన కాలేజీలను సైతం కౌన్సెలింగ్ కు అనుమతించాలని ఆదేశించింది. కాలేజీల గుర్తింపు అనేది హైకోర్టులో పెండింగ్లో ఉందని కౌన్సెలింగ్ కు హాజరయ్యే విద్యార్థులకు తెలియాజేయాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement