చంద్రబాబుతో బాలీవుడ్ హీరో భేటీ | ajay devgan meets chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో బాలీవుడ్ హీరో భేటీ

Apr 12 2016 5:51 PM | Updated on Jul 12 2019 6:01 PM

చంద్రబాబుతో బాలీవుడ్ హీరో భేటీ - Sakshi

చంద్రబాబుతో బాలీవుడ్ హీరో భేటీ

బాలీవుడ్‌ హీరో అజయ్ దేవగన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

విజయవాడ: బాలీవుడ్‌ హీరో అజయ్ దేవగన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తాను, తన భార్య కాజోల్ ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తామని ప్రతిపాదించగా చంద్రబాబు సంతోషంగా అంగీకరించారు. ఏపీలో ఎంటర్ టైన్ మెంట్, మీడియా, క్రియేటివ్ ప్రాజెక్టులు చేపట్టుందుకు అజయ్ దేవగన్ ముందుకు వచ్చారు.

ఏపీని విలక్షణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని అజయ్ దేవగన్ తో ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అత్యంత ఆధునిక టెక్నాలజీ లైడర్ టెక్నాలజీ సహాయంతో భూఉపరితల ఛాయాచిత్రాలు తీసే ప్రాజెక్టును అజయ్ దేవగన్ బృందం ప్రతిపాదించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని ఇరిగేషన్, కన్ స్ట్రక్షన్ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ఉపయోగించాలని సీఎం సూచించారు. పైలట్  ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయడానికి చంద్రబాబు అంగీకరించారు. విలక్షణనటుడు సాయికుమార్ విజయవాడ పోలీసు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement